Entertainment
 

అక్టోబరు 24, 2007

Tollywood నుండి

విషయ సూచిక

[మార్చు] గోపీచంద్ - 'ఒంటరి'

గోపీచంద్ హీరోగా ఈతరం ఫిలింస్ అధినేత పోకూరి బాబూరావు నిర్మిస్తున్న 'ఒంటరి' చిత్రం షూటింగ్ చడీ చప్పుడు లేకుండా జరుగుతోంది. దీనికి బి.వి. రమణ దర్శకత్వం, సంగీతం - మణిశర్మ, ఫైట్సు - విజయ్. ఈ సినిమా ద్వారా భావన హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమవుతున్నది.

ఇదే బానర్‌లో హీరోగా నిలదొక్కుకున్న గోపీచంద్ ('యజ్ఞం', 'రణం'), ఆ బానర్‌లో చేస్తున్న మూడవ సినిమా ఇది. 2008 జనవరికి 'ఒంటరి'ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్మాత బాబూరావు అన్నారు.

[మార్చు] హిందీ సినిమాల్లో - సదా

సదా తాజాగా రెండు హిందీ సినిమాల్లో నటిస్తుండడం విశేషం. వాటిలో ఒకటి సంగీత్ శివన్ దర్శకత్వం వహిస్తున్న 'క్లిక్'. మరో సినిమా'డి'. శ్రీనివాస్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీగా తయారవుతున్న ఈ సినిమాలో మిగతా తారలు.. రితూపర్ణసేన్ గుప్తా, రియాసేన్, దివ్య దత్తా, కల్పనా పండిట్, జెస్సీ రణధావా, రాఖీ సావంత్.

ప్రస్తుతం ఆమె తెలుగులో నితిన్ సరసన 'టక్కరి' సినిమాలో చేస్తున్నారు.

[మార్చు] See Also

[మార్చు] External Links

[మార్చు] Music